Header Banner

అకౌంట్‌లో వచ్చిపడ్డ డబ్బు, ఎవరేశారో తెలియదు..! అవాక్కయిన రైతు!

  Wed Mar 05, 2025 12:27        Others

నంద్యాలలో ఓ రైతుకు అకౌంట్‌లో డబ్బులు పడాల్సి ఉంది. ఆయన చాలా నెలలుగా ఆ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. డబ్బులు జమ కాకపోవడంతో వెళ్లి కలెక్టరేట్‌లో అధికారుల్ని అడిగారు. రెండో విడతలో డబ్బులు జమ అవుతాయని వారు చెప్పారు. ఆ రైతు రెండో విడతలో డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నారు.. ఇంతలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది.. అసలు సంగతి ఏంటని ఆరా తీస్తే.. నంద్యాలలో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. హైవే కోసం భూమిని ఇవ్వగా.. పరిహారం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతుకు ఊహించని పరిస్థితి ఎదురైంది.

 

అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయని చూస్తుంటే.. ఇంతలో ట్విస్ట్ ఎదురైంది. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు సంగతి తెలిసిందే. జాతీయ రహదారి 167కే కల్వకుర్తి- జమ్మలమడుగు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అధికారులు భూమిని సేకరించారు.. ఈ మేరకు రైతులకు పరిహారం చెల్లిస్తున్నారు. డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తున్నారు. ఈ హైవే కోసం 'కొత్తపల్లి మండలం గుమ్మడాపురం మజరా శింగరాజుపల్లెకు చెందిన మూగి వెంకటరమణారెడ్డి నుంచి 0.13 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు'. ఈ భూమికి పరిహారం కింద రూ.47,756 పరిహారం చెల్లించాల్సి ఉంది.. ఈ మేరకు అధికారులు అవార్డు నోటీసు కూడా వెంకట రమణారెడ్డికి అందింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

 

2025 జనవరి 31 నుంచి తొలి విడతగా రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో భూమికి సంబంధించిన నష్ట పరిహారం డబ్బుల్ని జమ చేస్తున్నారు. వెంకట రమణారెడ్డికి కూడా పరిహారం అందాల్సి ఉంది.ఇంతలో తనకు పరిహారం అందలేదని.. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ కాలేదని రైతు వెంకట రమణారెడ్డి కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. తన సమస్యపై భూ సేకరణ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టరేట్‌లో అధికారులు రెండో విడతలో డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుందని చెప్పి పంపించారు.

 

ఈనెల 4న శింగరాజుపల్లెకు చెందిన మారేడు ప్రమీలమ్మ భర్త యోహాను ట్విస్ట్ ఇచ్చారు.. నేరుగా రైతు వెంకటరమణారెడ్డిని కలిశారు. 'నా భార్య బ్యాంక్ అకౌంట్‌లో మీ భూమికి సంబంధించిన పరిహారం డబ్బులు జమ చేశారు' అని చెప్పారు. తాము ఆ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నట్లు యోహాను చెప్పడంతో రైతు వెంకటరమణారెడ్డి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు బాధిత రైతు. దీంతో డబ్బుల విషయంలో అసలు తప్పు ఎక్కడ జరిగిందో ఆరా తీసే పనిలో ఉన్నారు అధికారులు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

 

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NandyalFarmers #CompensationScam #HighwayLandIssue #FarmersFight #LandCompensationFraud #ShockingTwist #FarmerJustice #AccountFraud #NandyalScandal #LandAcquisitionTrouble #FarmersRights #StolenCompensation #HighwayLandScam #AgricultureJustice #NandyalTwist